మణుగూరు, జూన్ 29: మణుగూరు అటవీ శాఖలో రేంజర్‌గా విధులు నిర్వహిస్తున్న ఉపేందర్‌ను జిల్లా టాస్క్‌ఫోర్స్‌కు బదిలీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
మణుగూరు పరిధిలో అటవీ సంరక్షణ, అక్రమ అటవీ కార్యకలాపాల నియంత్రణ, వన్యప్రాణుల పరిరక్షణ వంటి అంశాల్లో ఆయన సేవలు అందించారు. తాజాగా జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్‌కు బదిలీ ఉత్తర్వులు జారీ కావడంతో త్వరలోనే కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఈ సందర్భంగా అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలియజేస్తూ కొత్త బాధ్యతల్లో విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
0 కామెంట్‌లు