గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు500 లీటర్ల బెల్లం పానకం స్వాధీనం – ఎస్సై పి.వి.ఎన్. రావు

గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు
500 లీటర్ల బెల్లం పానకం స్వాధీనం – ఎస్సై పి.వి.ఎన్. రావు

కరకగూడెం, జూన్ 29: కరకగూడెం మండలం కలవల నాగారం అటవీ ప్రాంతంలో గుడుంబా (నాటుసార) తయారీ స్థావరాలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 500 లీటర్ల బెల్లం పానకాన్ని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు.

అదేవిధంగా గుడుంబా తయారీకి ఉపయోగిస్తున్న గిన్నెలు, డ్రమ్ములు, బిందెలు తదితర సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా నాటుసార తయారీ, విక్రయాలను ఏమాత్రం సహించబోమని ఎస్సై పి.వి.ఎన్. రావు హెచ్చరించారు.

అటవీ ప్రాంతాల్లో గుడుంబా తయారీకి పాల్పడే వారిపై నిరంతరం నిఘా కొనసాగుతుందని, అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై స్పష్టం చేశారు. ఈ దాడుల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు