పినపాక, జూన్ 21 (ఎస్‌బీ న్యూస్): పినపాక మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ రామిరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు వివిధ యోగా ఆసనాలను ప్రదర్శించి వాటి ప్రాముఖ్యతను వివరించారు.
యోగ సాధన వల్ల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, నిత్య జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. యోగా ద్వారా ఏకాగ్రత, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని యోగా ఆసనాలు నిర్వహించారు. యోగా దినోత్సవం సందర్భంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ప్రతిజ్ఞ చేశారు.
0 కామెంట్‌లు