మణుగూరు, జూన్ 21 (ఎస్‌బీ న్యూస్): ప్రపంచ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని మణుగూరు మండలంలోని రామానుజవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తుల సహకారంతో సమకూర్చిన స్పోర్ట్స్ యూనిఫామ్‌లను విద్యార్థులకు గ్రామ సర్పంచ్ కల్పన పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కల్పన మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షించారు. క్రీడలు విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి దోహదపడతాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు యశోద, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు. యోగ దినోత్సవం సందర్భంగా విద్యార్థులు యోగా ఆసనాలు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.
0 కామెంట్‌లు