🔖*సమాధానం:*
* *బీఎల్‌ఓలు ప్రతి ఇంటికీ వెళ్ళి ఫోటో ఓటరు కార్డుల వివరాలను సరిపోలుస్తారు. ఒకటి లేదా రెండు నియోజకవర్గాల్లో పేర్లు ఉంటే, ఆ ఓటరు ఏ నియోజకవర్గంలో పేరు ఉంచుకోవాలని అనుకుంటున్నారో అడిగి తెలుసుకుంటారు. మిగిలిన రెండు పేర్లలో ఒకే ఓటరు రెండు చోట్ల పేరు ఉంటే, రెండో పేరును తొలగిస్తూ ఎన్నికల సంఘం వెబ్‌సైట్ voters.eci.gov.in లో వెళ్లి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తారు.*
✍️*2. ఆన్‌లైన్ ద్వారా ఎలక్టోరల్ రోల్స్ (ఓటర్ల జాబితా) లో పేరు ఎలా నమోదు చేసుకోవాలి?*
🔖*సమాధానం:*
* *కేంద్ర ఎన్నికల సంఘం వెబ్‌సైట్ లోని ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్లికేషన్ లభ్యమవుతుంది. ఓటరు గతంలో రిజిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్ నంబరు లేదా కొత్త మొబైల్ నంబరు ఉపయోగించి లాగిన్ కావాలి. కావలసిన ఫామ్‌ను ఎంపిక చేసుకుని దరఖాస్తు చేయాలి. 'full documentation form' అనే ఆప్షన్ ద్వారా అన్ని వివరాల నమోదు చేయాలి. ఓటరు జాతీయతను తెలిపే భారతీయుడు అని నిరూపించే పత్రాన్ని మాత్రమే ఈ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.*
✍️*3. ఒకే ఇంట్లో ఎంతమంది ఉన్నా, అందరి పేర్లూ ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి వస్తాయా?*
🔖*సమాధానం:*
* *బీఎల్‌ఓలు ఇంటింటి సర్వేలో కుటుంబంలో ఎంతమంది ఓటర్లు ఉన్నారనేది తెలుసుకొని ఒకే ఫ్యామిలీ ఓటర్లందరికీ ఒకే పోలింగ్ కేంద్రాన్ని కేటాయిస్తారు. ఆ తర్వాత ఓటరు సులభంగా ఓటు వేయడానికి వీలుగా ఉంటుంది. ఒకే కుటుంబానికి చెందిన సభ్యులందరి ఓట్లు ఒకే పోలింగ్ కేంద్రం పరిధిలోకి వచ్చేలా ceotelangana.nic.in వెబ్‌సైట్‌లో బీఎల్‌ఓల సమాచారం ఉంటుంది. ఫామ్-8 ద్వారా మార్పులు చేసుకోవచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం గరిష్టంగా ఏడు కిలోమీటర్ల లోపే పోలింగ్ కేంద్రాలు ఉండేలా చూస్తారు.*
✍️*4. ఎలక్టోరల్ రోల్స్ మార్పులు పూరించడంలో ఇబ్బందులు ఎదురైతే ఏం చేయాలి?*
🔖*సమాధానం:*
* *బీఎల్‌ఓ ప్రతి ఇంటికి వచ్చి ఓటరు గుర్తింపు కార్డుకు సంబంధించిన వివరాలు అడిగినప్పుడు అన్ని వివరాలు నమోదు చేసుకోవాలి. ఒకవేళ ఇబ్బందులు ఎదురైతే కొత్త ఫారమ్‌లను వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఏవైనా తప్పులు ఉంటే తప్పుగా ఉన్న సమాచారాన్ని సరిగ్గా మార్చాలని వివరాలను నమోదు చేయవచ్చు.*
✍️*5. ఎలక్టోరల్-2002 ఓటర్ల జాబితాతో పేరు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి?*
🔖*సమాధానం:*
* *కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన https://voters.eci.gov.in లేదా https://ceotelangana.nic.in పోర్టల్‌లోకి వెళ్లి 'సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్' ఆప్షన్‌లో వివరాలను నమోదు చేయాలి. పార్లమెంటు మరియు శాసనసభ నియోజకవర్గాల ఓటర్ల జాబితాతో పాటు ఓటరు పేరు ఏ పోలింగ్ కేంద్ర పరిధిలో ఉందో తెలుసుకోవచ్చు.*
✍️*6. 2004 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేసిన వ్యక్తి పేరు ఐదు ఏళ్ల తర్వాత కూడా ఓటర్ల జాబితాలో లేదంటే ఏం చేయాలి?*
🔖*సమాధానం:*
* *నవంబర్ 2002 జాబితాలో పేరు లేకపోతే ఆ నియోజకవర్గ ఓటరుగా నమోదు చేసుకోలేరు. అలాంటప్పుడు వారు అభ్యంతరాల/సవరణల దరఖాస్తు ఫారమ్ ద్వారా నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకోవచ్చు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ దరఖాస్తులు సమర్పించవచ్చు.*
✍️*7. ఓటరు కొత్త ప్రాంతానికి మారినప్పుడు చిరునామా ఎలా అప్‌డేట్ చేయాలి?*
🔖*సమాధానం:*
* *అట్టి నియోజకవర్గ ఓటరు జాబితా ప్రచురించిన తర్వాత నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోర్టల్ లో ఫామ్-8 ని నింపి సమర్పించవచ్చు. ఆ ఫారమ్‌ను ఆయా 30 రోజుల్లో పరిశీలించి, అభ్యంతరాల గడువు ముగిసిన తర్వాత మార్పులు జాబితాలో చేస్తారు.*
✍️*8. ఎలక్టోరల్ రోల్స్ ప్రకారం ఫారమ్ లోని అంశాల్లో అన్ని వివరాలను తప్పనిసరిగా నింపాలా?*
🔖*సమాధానం:*
* *ఎలక్టోరల్ రోల్స్ లోని ప్రతి కాలమ్ లో అడిగిన సమాచారాన్ని సమర్పించడం ఎంతో ముఖ్యం. కాలమ్‌లు ఖాళీగా ఉంటే ఆ ఫారమ్ తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఉంటాయి.*
✍️*9. 18 సంవత్సరాలు నిండిన కొత్త ఓటర్లు జాబితాలో తమ పేరు చేర్చడానికి ఎవరెవరు దరఖాస్తు చేసుకోవాలి?*
🔖*సమాధానం:*
* *బీఎల్‌ఓ ప్రతి ఫ్యామిలీకి ఫారమ్‌లు ఇస్తారు. కొత్త ఓటర్లు ఎవరైనా ఉంటే వారు ఫామ్-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఓటరు అర్హత తేదీ 1 జనవరి 2026 నాటికి 18 సంవత్సరాలు నిండిన కొత్త ఓటర్లు తమ పేరు నమోదు చేసుకోవచ్చు.*
✍️*10. ఎలక్టోరల్ రోల్స్ ప్రక్రియ మరియు ఓటర్ల జాబితాల సవరణలో సమస్యలు ఏర్పడితే ఎక్కడ ఫిర్యాదు చేయవచ్చు?*
🔖*సమాధానం:*
* *బీఎల్‌ఓ ప్రతి సమస్యను పరిష్కరిస్తారు. ఒకవేళ టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నెంబర్ 1950 కు కాల్ చేసి కూడా ఫిర్యాదు చేయవచ్చు. లేదా 'నేషనల్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్' (NGRS) పోర్టల్‌లో కూడా ఫిర్యాదును నమోదు చేయవచ్చు.*
✍️*11. ఓటరు, ఆయన కుటుంబ సభ్యులు మొత్తం ఊరిలో అందుబాటులో లేకపోతే ఎలా నమోదు చేయాలి?*
🔖*సమాధానం:*
* *ఇలాంటి సమయంలో ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.*
✍️*12. ఎలక్టోరల్ రోల్స్ సవరణ ప్రక్రియ ఎప్పటివరకు ముగుస్తుంది?*
🔖*సమాధానం:*
* *నియోజకవర్గాల ఓటర్ల జాబితా సవరణ పూర్తయిన తర్వాత వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచుతారు.*
✍️*13. ఓటును ఎప్పుడు గుర్తింపు కార్డుగా ఉపయోగించాలి? ఏ కార్డులను ఓటరు గుర్తింపు కార్డుగా గుర్తిస్తారు?*
🔖*సమాధానం:*
* *ఓటు హక్కు వినియోగించుకోవడానికి వెళ్ళే సమయంలో ఓటరు గుర్తింపు కార్డు (EPIC) లేకపోతే కేంద్ర ఎన్నికల సంఘం సూచించిన కింది 12 రకాల ప్రత్యామ్నాయ గుర్తింపు కార్డులను ఉపయోగించవచ్చు:*
* *1. ఆధార్ కార్డు*
* *2. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) జాబ్ కార్డు*
* *3. బ్యాంకు లేదా పోస్టాఫీసు వారు జారీ చేసిన ఫోటోతో కూడిన పాస్ బుక్కులు*
* *4. కార్మిక మంత్రిత్వ శాఖ ద్వారా జారీ చేయబడిన హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్*
* *5. డ్రైవింగ్ లైసెన్స్*
* *6. పాన్‌కార్డ్ (PAN Card)*
* *7. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (NPR) స్మార్ట్ కార్డ్*
* *8. ఇండియన్ పాస్‌పోర్ట్*
* *9. ఫోటోతో కూడిన పెన్షన్ పత్రాలు*
* *10. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు ఉద్యోగులకు జారీ చేసిన ఫోటో గుర్తింపు కార్డులు*
* *11. పార్లమెంటు, శాసనసభ సభ్యులకు (MP/MLA) జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు*
* *12. యునైటెడ్ ఐడీ (UDID) కార్డ్ (దివ్యాంగులకు జారీ చేసేది)*
✍️*14. విదేశాలలో లేదా ఇతర రాష్ట్రాల్లో ఉన్న వ్యక్తులు ఎలక్టోరల్ రోల్స్ లో ఎలా నమోదు చేసుకోవాలి?*
🔖*సమాధానం:*
* *విదేశాలలో లేదా ఇతర రాష్ట్రాలలో ఉన్న వ్యక్తులు సంబంధిత ఫారమ్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా వారి సంతకంతో కూడిన పత్రాలను సంబంధిత బీఎల్‌ఓ కు అందజేయాలి.
0 కామెంట్‌లు