ఆదోని, జూన్ 19 (స్వాతంత్ర్య భారత్):
ఆదోని జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్ష శిబిరం శుక్రవారం నాటికి 217వ రోజుకు చేరుకుంది. పశ్చిమ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు.
ఈ సందర్భంగా దీక్షా శిబిరాన్ని సందర్శించిన విద్యార్థి సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ, పశ్చిమ ప్రాంతమైన ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, పత్తికొండ, ఆలూరు ప్రాంతాల ప్రజలు ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ పరిస్థితిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.
ప్రతిపక్షాలు, అధికార పక్షం రెండూ ఈ సమస్యపై స్పందించకపోవడం బాధాకరమని పేర్కొన్నారు. పశ్చిమ ప్రాంత అభివృద్ధి కోసం తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలకు అధికార పార్టీనే బాధ్యత వహించాల్సి ఉంటుందని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి.
ఈ దీక్షలో సుభాష్ చంద్రబోస్, కుమార్, పగడాల కోదండ, పగడాల రమేష్, ఉదయ్, వైఫై నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.
– స్వాతంత్ర్య భారత్ ప్రతినిధి, స్వామిదాసు, ఆదోని
0 కామెంట్‌లు