గుండాల: విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. గుండాలలో విద్యాశాఖ అధికారులు, హెచ్‌ఎంలు, జూనియర్ కళాశాల ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షలో ఉత్తీర్ణత శాతం, ఉపాధ్యాయుల ఖాళీలు, విద్యార్థుల నమోదు, మౌలిక సదుపాయాలపై చర్చించారు. పాఠశాలలు, కళాశాలల్లో ఉన్న సమస్యలను నిర్భయంగా తెలియజేయాలని అధికారులకు సూచించారు. సీఎం A. Revanth Reddy నాయకత్వంలో ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అవసరమైన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. #Gundala #Pinapaka #Education #PayamVenkateswarlu #SBNews
0 కామెంట్‌లు