గిరిజన సొసైటీల్లో గిరిజనేతరులకు సభ్యత్వం చట్టవిరుద్ధం: తుడుందెబ్బ

జానంపేటలో ఆదివాసీ చట్టాలను నిర్వీర్యం చేసే కుట్రలను అడ్డుకోవాలి: తుడుందెబ్బ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం జనంపేట గ్రామంలో ఆదివాసీల హక్కులు, గిరిజన రక్షణ చట్టాలను బలహీనపరిచే చర్యలను తుడుందెబ్బ తీవ్రంగా ఖండించింది. బుధవారం పినపాక మండలం  జారంపేట లో తురుము దెబ్బ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలేబోయిన వెంకటనారాయణ మాట్లాడుతూ గిరిజనుల ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాల కోసం ఏర్పాటు చేసిన గిరిజన సహకార సంఘాలు, సొసైటీలలో గిరిజనేతరులకు సభ్యత్వం కల్పించాలనే డిమాండ్ చట్టవిరుద్ధమని  పేర్కొన్నారు.
ఆదివాసీ పేసా చట్టం, 1/70 చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వ్యవస్థల్లో గిరిజనేతరులను చేర్చడం ద్వారా షెడ్యూల్డ్ తెగలకు రాజ్యాంగబద్ధంగా కల్పించిన రక్షణలను నిర్వీర్యం చేసే ప్రయత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
జానంపేటలో జరుగుతున్న పరిణామాలపై సమగ్ర విచారణ జరిపి, ఆదివాసీ హక్కులకు భంగం కలిగించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తుడుందెబ్బ కోరింది. ఆదివాసీల హక్కులు, చట్టాలు, రాజ్యాంగ పరిరక్షణల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, అవసరమైతే ప్రజాస్వామ్యబద్ధ ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు