కార్పెంటర్ యూనియన్ మండల అధ్యక్షుడు రమణాచారి మృతి.. కార్మిక ఉద్యమానికి తీరని లోటు: సిపిఐ

కార్పెంటర్ యూనియన్ నాయకుడు రమణాచారి మృతి.. సిపిఐ నేతల సంతాపం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని ఏడూళ్ల బయ్యారం గ్రామానికి చెందిన కార్పెంటర్ యూనియన్ మండల అధ్యక్షుడు కోయిలకుంట్ల రమణాచారి మంగళవారం ఉదయం మృతి చెందారు. ఆయన మృతిపై సిపిఐ పినపాక మండల కార్యదర్శి తోకటి కుమార్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రమణాచారి ఏఐటీయూసీ కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషించారని, ఎన్నో ఏళ్లుగా పార్టీకి అండదండగా నిలుస్తూ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేశారని గుర్తు చేశారు. ఫారెస్ట్ అధికారుల దాడులు, ఇబ్బందులను సైతం లెక్కచేయకుండా కార్మికుల హక్కుల కోసం పోరాడిన నాయకుడిగా ఆయన సేవలను కొనియాడారు.

రమణాచారి మృతి కార్పెంటర్ యూనియన్‌కు, కార్మిక ఉద్యమానికి తీరని లోటని పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు పత్తిపాటి నాగేశ్వరరావు, గడ్డం మనోహర్ చారి, సిపిఐ సీనియర్ నాయకులు పద్మనాభరాజు, మండల సహాయ కార్యదర్శులు కప్పా వెంకటేశ్వర్లు, రమేష్, గడ్డం వెంకటచారి, శివారపు బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు