పినపాక మండలం వెంకట్రావుపేట గ్రామపంచాయతీలో తాగునీటి సమస్య పరిష్కారానికి బోర్వెల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. శుక్రవారం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ సుతారి సింధుజ పనులను ప్రారంభించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పినపాక మండల అధ్యక్షుడు గోడిశాల రామనాథం హాజరై, గ్రామాల్లో తాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాటూరి రవీంద్రతో పాటు ప్రమోద్, సమ్మయ్య, ప్రవీణ్, రాజు, కృష్ణ, సాంబశివరావు, రవిబాబు, హరీష్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు