తన 20వ పుట్టినరోజును వినూత్నంగా జరుపుకుంటూ పోలేబోయిన వంశీ వెంకట్ యువతకు ఆదర్శంగా నిలిచాడు. సాధారణంగా కేక్ కటింగ్, వేడుకలతో పుట్టినరోజులు జరుపుకునే ఈ రోజుల్లో, ఆరోగ్యమే మహాభాగ్యం అనే సందేశాన్ని సమాజానికి చాటిచెప్పేందుకు వంశీ వెంకట్ 20 కిలోమీటర్ల రన్నింగ్ పూర్తి చేశాడు.
తన 20వ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ పరుగు ప్రయాణాన్ని ఆయన 2 గంటల 22 నిమిషాల 39 సెకన్లలో విజయవంతంగా పూర్తి చేశాడు. శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని ఈ సందర్భంగా నిరూపించాడు.
వంశీ వెంకట్ చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని స్థానికులు, క్రీడాభిమానులు అభినందించారు. పుట్టినరోజులను ఆరోగ్యకరమైన కార్యక్రమాలతో జరుపుకోవాలనే సందేశాన్ని ఆయన యువతకు అందించారని ప్రశంసించారు.
"పుట్టినరోజు అనేది కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, జీవితంలో ఒక మంచి లక్ష్యాన్ని గుర్తు చేసుకునే రోజు కావాలి" అనే సందేశాన్ని తన చర్య ద్వారా వంశీ వెంకట్ అందరికీ తెలియజేశాడు.
0 కామెంట్‌లు