మొహరం వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం

మణుగూరు పట్టణంలో మొహర్రం మాసం సందర్భంగా నిర్వహించిన పీర్ల పండుగ వేడుకల్లో పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీర్ల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, ప్రజలందరికీ శాంతి, సౌభ్రాతృత్వం, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షించారు. ముస్లిం సోదరులకు మొహర్రం శుభాకాంక్షలు తెలియజేస్తూ, అన్ని మతాల పండుగలు సామరస్యానికి ప్రతీకలని అన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ముస్లిం పెద్దలు, పార్టీ నాయకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు