సజ్జలబోడు గ్రామంలో “రుద్రారణ్య” చిత్ర షూటింగ్ పూర్తి

సజ్జలబోడు గ్రామంలో  “రుద్రారణ్య” చిత్ర షూటింగ్ పూర్తి

గుండాల మండలం జూన్ 24 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల మండలం సజ్జలబోడు గ్రామంలో ప్రముఖ యువ దర్శకుడు దుష్యంత్ దీకొండ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “రుద్రారణ్య” చిత్ర షూటింగ్ ముగిసింది.

ఇప్పటికే గ్రామీణ ప్రేమకథా చిత్రంగా ప్రేక్షకుల ప్రశంసలు పొందిన “సజ్జలబోడు ప్రేమకథ” చిత్రంతో గుర్తింపు పొందిన దర్శకుడు దుష్యంత్ దీకొండ, ఈసారి పూర్తి భిన్నమైన కథాంశంతో “రుద్రారణ్య” చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అరణ్య ప్రాంతాల నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేమ, భావోద్వేగాలు, మానవ సంబంధాలు, ప్రకృతి పరిరక్షణ, సామాజిక సందేశాల సమ్మేళనంగా రూపొందుతోంది.

ఈ చిత్రంలో ప్రముఖ నటులు జలాల్ మహమ్మద్, ఈసం ముసుపతి రావు, భవాని, సీతారాములు, షారోజ్, గారెల సుందరమ్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

చిత్ర ఛాయాగ్రహణ బాధ్యతలను ప్రకాశ్ వజ్జా నిర్వహిస్తున్నారు. గుండాల మండలంలోని ప్రకృతి సోయగాలు, అరణ్య ప్రాంతాలు, గిరిజన సంస్కృతి మరియు స్థానిక జీవన విధానాన్ని సహజత్వంతో వెండితెరపై ఆవిష్కరించేందుకు చిత్ర బృందం కృషి చేస్తోంది.

ఈ సందర్భంగా దర్శకుడు దుష్యంత్ దీకొండ మాట్లాడుతూ…

“మన భద్రాద్రి జిల్లాలోని అద్భుతమైన ప్రకృతి అందాలను, అరణ్య జీవనాన్ని, మనుషుల మధ్య ఉన్న భావోద్వేగ బంధాలను ప్రేక్షకులకు చేరవేయాలనే ఉద్దేశంతో ‘రుద్రారణ్య’ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. స్థానిక కళాకారులకు అవకాశం కల్పిస్తూ, మన ప్రాంత ప్రతిభను వెలుగులోకి తీసుకురావడం మా ప్రధాన లక్ష్యం. ప్రేక్షకులు తప్పకుండా ఈ చిత్రాన్ని ఆదరిస్తారని నమ్ముతున్నాం” అని తెలిపారు.

చిత్ర యూనిట్ సభ్యులు మాట్లాడుతూ, గుండాల మండలం మరియు పరిసర ప్రాంతాల్లోని అందమైన లొకేషన్లలో చిత్రికరించారు, త్వరలోనే మరిన్ని విశేషాలను వెల్లడిస్తామని తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు