భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బీఎల్ఏల (బూత్ లెవల్ ఏజెంట్లు) శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తోట దేవి ప్రసన్న, టీపీసీసీ ఉపాధ్యక్షులు షబ్బీర్ అలీ హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా నాయకులు బీఎల్ఏల పాత్ర, ఓటరు జాబితాల పరిశీలన, పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్యకర్తలకు అవగాహన కల్పించారు. పార్టీ నిర్మాణంలో బూత్ స్థాయి నాయకుల పాత్ర కీలకమని పేర్కొంటూ, ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకమై పార్టీ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో విజయవంతం చేయాలని సూచించారు.
0 కామెంట్‌లు