భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని పూల మార్కెట్ వద్ద పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు నిర్వహించారు. ఎస్సై రావుఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాల పత్రాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, బీమా పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, ట్రిపుల్ రైడింగ్, అధిక వేగంతో వాహనాలు నడపడం వంటి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడవద్దని హెచ్చరించారు.
ప్రజల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఇటువంటి ప్రత్యేక తనిఖీలు కొనసాగుతాయని ఎస్సై రావుఫ్ తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను పాటించి సురక్షిత ప్రయాణం చేయాలని సూచించారు.
0 కామెంట్‌లు