భద్రాచలం పట్టణంలోని కొత్త మార్కెట్‌కు మాజీ గౌరవ శాసనసభ్యులు, కీర్తిశేషులు కుంజా బొజ్జి పేరు పెట్టాలని భద్రాచలం ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు తీర్మానం చేసి స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ గిరిజనుల అభ్యున్నతికి కుంజా బొజ్జి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన పేరును కొత్త మార్కెట్‌కు పెట్టడం ద్వారా భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
వినతిపత్రాన్ని స్వీకరించిన ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం కొత్త మార్కెట్‌ను ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌గా అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో, మార్కెట్‌కు **"కుంజా బొజ్జి ఇంటిగ్రేటెడ్ మార్కెట్"**గా పేరు పెట్టేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే స్పందనపై ఆదివాసీ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తూ, తమ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
0 కామెంట్‌లు