అచ్చంపేట, జూన్ 20 (ఎస్‌బీ న్యూస్): ప్రభుత్వ పాఠశాలల సంఖ్య తగ్గింపుపై సీఎం చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బల్ముల ప్రేమ్‌కుమార్ డిమాండ్ చేశారు. శనివారం అచ్చంపేటలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను మూసివేయడం కాకుండా మౌలిక సదుపాయాలు కల్పించి మరింత బలోపేతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
విద్య ప్రతి విద్యార్థి హక్కు అని, ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం ద్వారా పేద మరియు మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యా హక్కు చట్టం (RTE) ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించేలా పర్యవేక్షణ పెంచాలని డిమాండ్ చేశారు.
#AISF
#Achampet
#GovernmentSchools
#SaveGovernmentEducation
#EducationForAll
#RTEAct
#StudentRights
#TelanganaEducation
#BalmulaPremKumar
#RevanthReddy
#EducationNews
#SBNews
#TelanganaNews
#LocalNews
#BreakingNews
0 కామెంట్‌లు