పినపాక: పినపాక మండలం పాండురంగాపురం గ్రామంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఈసం భవతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐదు సంవత్సరాలలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
పోలియో వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం చేపట్టిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, చిన్నారులను సమీప పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి చుక్కలు వేయించాలని ఆమె కోరారు. పోలియో రహిత తెలంగాణ లక్ష్య సాధనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు