ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: సర్పంచ్ స్వప్న

ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి: సర్పంచ్ స్వప్న
పినపాక: పినపాక మండలం భూపాలపట్నం గ్రామంలోని పల్స్ పోలియో కేంద్రంలో సర్పంచ్ స్వప్న, ఉప సర్పంచ్ శిరీష చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామంలో పోలియో చుక్కల ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని, పోలియో రహిత సమాజ నిర్మాణానికి ప్రతి తల్లిదండ్రులు సహకరించాలని సర్పంచ్ స్వప్న కోరారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు