నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం రంగాపురం గ్రామంలోని శ్రీశైల ఉత్తర ద్వారంగా ప్రసిద్ధి చెందిన శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానంను నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తన తల్లిదండ్రులు, కుమారుడితో కలిసి దర్శించుకున్నారు.
ఆలయానికి చేరుకున్న కలెక్టర్‌కు అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో గణపతి పూజ, ఉమాదేవికి కుంకుమార్చన, శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి అభిషేకం నిర్వహించారు.
పూజా కార్యక్రమాల అనంతరం అర్చకులు కలెక్టర్ కుటుంబ సభ్యులకు తీర్థప్రసాదాలు అందజేసి ఆలయ విశిష్టత, చారిత్రక ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా స్వామివారి శేష వస్త్రంతో కలెక్టర్‌ను సన్మానించి వేద ఆశీర్వచనం అందించారు.
తదుపరి కలెక్టర్ కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ పరిసర ప్రాంతాలు, పాపనాశనం ప్రాంతాన్ని సందర్శించారు. ఆలయ పరిసరాలు ఆహ్లాదకరంగా ఉన్నాయని ప్రశంసించారు. అనంతరం దేవస్థానం నిత్య అన్నదాన సత్రంలో స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మార్వో, పోలీసు అధికారులు, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ బీరం మాధవ రెడ్డి, కమిటీ సభ్యుడు పవన్ కుమార్, ఆలయ ముఖ్య అర్చకులు వీరయ్య శాస్త్రి, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
#UmaMaheshwaram #SrisailamUttaraDwaram #Nagarkurnool #Achampet #Rangapuram #HemantKeshavPatil #TempleVisit #TelanganaTemples #SBNews
0 కామెంట్‌లు