లారీ ఢీకొని బ్లూ కోల్ట్స్ సిబ్బందికి గాయాలు

లారీ ఢీకొని బ్లూ కోల్ట్స్ సిబ్బందికి గాయాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని సోంపల్లి ఇసుక ర్యాంపు వద్ద గ్రామస్తులు లారీలను అడ్డుకుంటున్నారనే సమాచారం అందడంతో బూర్గంపాడు బ్లూ కోల్ట్స్ సిబ్బంది కానిస్టేబుల్ మంగీలాల్, హోంగార్డ్ శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు.

గ్రామస్తులకు సర్ది చెప్పి లారీల రాకపోకలను పునరుద్ధరించిన అనంతరం తిరిగి వస్తుండగా దోమలవాగు నుంచి బయటకు వస్తున్న సమయంలో AP16TJ 3569 నంబర్ గల లారీ బైకును ఢీకొట్టింది. లారీ డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా వాహనం నడపడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

ఈ ప్రమాదంలో కానిస్టేబుల్ మంగీలాల్, హోంగార్డ్ శ్రీనివాసరావుకు గాయాలయ్యాయి. వారు ప్రయాణిస్తున్న బైక్‌తో పాటు విధుల్లో ఉపయోగిస్తున్న రెండు ట్యాబ్‌లు కూడా ధ్వంసమయ్యాయి.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

#Burgampadu #Sompalli #BlueColts #RoadAccident #PoliceStaff #BhadradriKothagudem #TelanganaPolice #SBNews 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు