-హాజరుకావాలని పగడాల సతీష్ రెడ్డి పిలుపు
భారత్ రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) పినపాక నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశం రేపు (సోమవారం) నిర్వహించనున్నట్లు పార్టీ మండల మాజీ అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి తెలిపారు. ఆదివారం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో గల పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.ఈ నెల 15న సోమవారం ఉదయం 9:00 గంటలకు మణుగూరులోని హనుమాన్ ఫంక్షన్ హాల్ నందు ఈ నియోజకవర్గ స్థాయి సమావేశం జరగనుందన్నారు . పినపాక మండలంలోని 23 గ్రామ పంచాయతీలకు చెందిన బిఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ అభిమానులు ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన కోరారు.
నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన ఈ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ప్రజాప్రతినిధులు, నాయకులు, శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని సతీష్ రెడ్డి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
0 కామెంట్‌లు