అగ్నివీర్‌లో గిరిజన విద్యార్థుల ప్రతిభ

అగ్నివీర్‌లో గిరిజన విద్యార్థుల ప్రతిభ
మణుగూరు, జూన్ 9: తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర డిగ్రీ కళాశాల, మణుగూరు విద్యార్థులు అగ్నివీర్ ఎంపికలో ప్రతిభ కనబరిచారు. ఇటీవల వెలువడిన అగ్నివీర్ ఫలితాల్లో MPCS గ్రూప్‌కు చెందిన బి. జనార్ధన్, PP గ్రూప్‌కు చెందిన ఈ. సాంబశివరావు భారత రక్షణ రంగంలో సేవలందించేందుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రవి బండారుపల్లి, అధ్యాపక బృందం విద్యార్థులను అభినందించారు. గిరిజన విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ చాటడం గర్వకారణమని పేర్కొన్నారు.

#Agniveer #Manuguru #TribalStudents #Gurukulam #BhadradriKothagudem #Telangana #EducationNews #DefenceServices #SuccessStory #SBNEWS 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు