పినపాక
పినపాక మండలం సీతారాంపురం గ్రామపంచాయతీ పరిధిలోని మణుగూరు–ఏటూరునాగారం ప్రధాన రహదారిపై భారీ వృక్షం నేలకూలడంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ అనిత వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టును తొలగించే చర్యలు చేపట్టారు. స్థానికుల సహకారంతో చెట్టును తొలగించి వాహనాల రాకపోకలు సజావుగా సాగేందుకు చర్యలు తీసుకున్నారు. సర్పంచ్ తక్షణ స్పందనపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకటేశ్వర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు
0 కామెంట్‌లు