మహిళల రక్షణకు మరో ముందడుగు

మహిళల రక్షణకు మరో ముందడుగు
నాగర్‌కర్నూల్‌లో తెలంగాణ పోలీస్ భద్రత నిలయానికి భూమిపూజలో 
మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్ రెడ్డి 
నాగర్‌కర్నూల్, జూన్ 23:

నాగర్‌కర్నూల్ పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా నూతనంగా నిర్మించనున్న తెలంగాణ పోలీస్ భద్రత నిలయానికి మంత్రి సీతక్క భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ మాట్లాడుతూ, మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ పోలీస్ భద్రత నిలయం నిర్మాణం ద్వారా మరో కీలక అడుగు వేసిందన్నారు. సమాజంలో సగభాగమైన మహిళలకు పూర్తి స్థాయి రక్షణ, భరోసా కల్పించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించి ఆర్థిక భరోసా అందించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు భద్రత నిలయం ద్వారా మహిళలు మరింత ధైర్యంగా, సురక్షితంగా జీవించే వాతావరణాన్ని కల్పిస్తోందని పేర్కొన్నారు.

మంత్రి సీతక్క ప్రజల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కార మార్గాలను చూపుతున్న ప్రజానాయకురాలని కొనియాడారు. మహిళా భద్రత, శాంతిభద్రతల పరిరక్షణలో మహిళా పోలీస్ విభాగాలను మరింత బలోపేతం చేస్తూ ప్రతి మహిళకు “మేమున్నాం” అనే నమ్మకాన్ని ప్రభుత్వం కల్పిస్తోందన్నారు.

మహిళలకు అండగా నిలుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
#Nagarkurnool #Seethakka #VamsiKrishna #RajeshReddy #TelanganaPolice #WomensSafety #CongressGovernment #RevanthReddy #Telangana #SBNEWS

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు