- ఎంపీడీవో కు,పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సర్పంచులు
- లేని తీర్మానాలకు బిల్లులు ఎలా చేయాలి..?
- కలెక్టరే సమాధానం చెప్పాలని సర్పంచుల కన్నీటి ఆవేదన
పినపాక మండలంలోని పలువురు గ్రామపంచాయతీ సర్పంచులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామసభలు, పంచాయతీ తీర్మానాలు లేకుండానే కొన్ని పనులకు బిల్లులు చేయాలని ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆరోపిస్తూ ఎంపీడీవోకు,పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
గ్రామపంచాయతీలకు సంబంధించిన నిబంధనలు, చట్టాలను పాటిస్తూ పని చేస్తున్న తమపై అనవసర ఒత్తిళ్లు తీసుకురావడం సరికాదని సర్పంచులు పేర్కొన్నారు. గ్రామసభ ఆమోదం లేకుండా, పంచాయతీ తీర్మానం లేకుండా బిల్లులు ఎలా చేయగలమని ప్రశ్నించారు.
ఈ విషయంలో జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. ప్రజాప్రతినిధులుగా తమ బాధ్యతలను నిర్వర్తించే క్రమంలో ఎదురవుతున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.తమ ఆవేదనను అధికారులు పట్టించుకోవడం లేదని, అందుకే పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని సర్పంచులు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ అంశంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
0 కామెంట్‌లు