గుండాల పీహెచ్సీ ఘటనపై సమగ్ర విచారణ జరిపిబాధ్యులపై చర్యలు తీసుకోవాలి

గుండాల పీహెచ్సీ ఘటనపై సమగ్ర విచారణ జరిపి

బాధ్యులపై చర్యలు తీసుకోవాలి

◆తల్లి, శిశువు మృతి అత్యంత విషాదకరం: బొబ్బిలి పవన్ కళ్యాణ్

> బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్

గుండాల మండలం జూన్ 19 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి

 గుండాల మండల కేంద్రంలోని ప్రభుత్వ

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో జరిగిన ఘటనలో ఒక నిండు గర్భిణీతో పాటు ఆమె కడుపులోని శిశువు మృతి చెందడం అత్యంత బాధాకరమని గుండాల మండల యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, సోషల్ మీడియా కోఆర్డినేటర్ బొబ్బిలి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఆయన కోరారు. గురువారం రువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గుండాల పీహెచ్సీలో జరిగిన ఘటనకు సంబంధించిన అన్ని అంశాలను అధికారులు నిష్పక్షపాతంగా పరిశీలించి, బాధ్యత వహించాల్సిన వారిని గుర్తించాలని సూచించారు. ఈ ఘటనలో ఏవైనా నిర్లక్ష్యాలు లేదా విధి నిర్వహణలో లోపాలు ఉన్నట్లు తేలితే సంబంధిత వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన

డిమాండ్ చేశారు. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని కోరారు. మృతి చెందిన గర్భిణీ కుటుంబానికి ప్రభుత్వం తక్షణ సహాయం అందించి, అన్ని విధాలుగా ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజల ఆరోగ్య భద్రతకు సంబంధించిన అంశాల్లో అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా పర్యవేక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ ఘటనపై సమగ్ర విచారణ నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని, ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని బొబ్బిలి పవన్ కళ్యాణ్ అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు