చేయూత పెన్షన్ లబ్ధిదారులకు అలర్ట్.. 22వ తేదీలోపు లైవ్ అథెంటికేషన్ తప్పనిసరి

పినపాక మండలంలో చేయూత పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులు ఈ నెల 22వ తేదీలోపు తప్పనిసరిగా లైవ్ అథెంటికేషన్ పూర్తి చేయాలని ఎంపీడీవో సంకీర్త్ సూచించారు. గడువులోపు ప్రక్రియ పూర్తి చేయని వారి పెన్షన్ నిలిచిపోయే అవకాశం ఉందని హెచ్చరించారు. లబ్ధిదారులు వెంటనే తమ గ్రామ పంచాయతీ కార్యదర్శిని సంప్రదించి లైవ్ అథెంటికేషన్ పూర్తి చేసుకోవాలని కోరారు. పెన్షన్ కొనసాగాలంటే ఈ ప్రక్రియ తప్పనిసరి అని తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు