ఇల్లందు క్రాస్ నుండి బొమ్మనపల్లి క్రాస్ మధ్యన గల లోతువాగు గ్రామం వద్ద జాతీయ రహదారి (NH-930P) పైన గల ఓవర్ బ్రిడ్జి రిపేర్ పనులు జరుగుచున్నందున, తేది. 18.06.2026 ఉదయం నుండి ట్రాఫిక్ డైవర్షన్ చేయడం జరుగుతుంది.
కావున వాహనదారులకు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, కొత్తగూడెం సబ్ డివిజనల్ పోలీస్ అధికారి శ్రీ L. ఆదినారాయణ గారు ముందస్తుగా ఈ క్రింది ట్రాఫిక్ సూచనలను తెలియజేసారు. వాహనదారులు దీనిని గమనించి, పోలీస్ వారు నిర్దేశించిన రూట్లలో వెళ్లవలసినదిగా సూచించడమైనది.
1. ఇల్లందు నుండి పాల్వంచ వైపు వెళ్ళు వాహనదారులు (రూట్ మ్యాప్)
భారీ లోడ్ వాహనాలు (Heavy Vehicles):
బొమ్మనపల్లి క్రాస్ - హేమచంద్రాపురం - శేషగిరినగర్ -పోస్ట్ ఆఫీస్ సెంటర్ - మున్సిపల్ ఆఫీస్ -ఓల్డ్ కొత్తగూడెం - జగ్గు తండా -నవభారత్ మీదగా పాల్వంచ వెళ్లగలరు.
ఆర్టీసీ బస్సులు, 4-వీలర్స్, 3-వీలర్స్, 2-వీలర్స్:
బొమ్మనపల్లి క్రాస్ - హేమచంద్రాపురం శేషగిరినగర్ - పోస్ట్ ఆఫీస్ సెంటర్ -బస్ స్టాండ్ - ఓల్డ్ డిపో ఇల్లందు క్రాస్ నుండి పాల్వంచ వెళ్లగలరు.
2. పాల్వంచ నుండి ఇల్లందు వైపు వెళ్ళు వాహనదారులు (రూట్ మ్యాప్)
భారీ లోడ్ వాహనాలు (Heavy Vehicles):
నవభారత్ - జగ్గు తండా - ఓల్డ్ కొత్తగూడెం - మున్సిపల్ ఆఫీస్ -పోస్ట్ ఆఫీస్ సెంటర్ - శేషగిరినగర్ -హేమచంద్రాపురం నుండి బొమ్మనపల్లి క్రాస్ మీదగా వెళ్లగలరు .
ఆర్టీసీ బస్సులు, 4-వీలర్స్, 3-వీలర్స్, 2-వీలర్స్:
ఇల్లందు క్రాస్ - ఓల్డ్ డిపో - బస్ స్టాండ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ - శేషగిరినగర్ హేమచంద్రాపురం నుండి బొమ్మనపల్లి క్రాస్ మీదగా వెళ్లగలరు.
3. పాల్వంచ నుండి ఖమ్మం వైపు వెళ్ళు వాహనదారులు (రూట్ మ్యాప్)
భారీ లోడ్ వాహనాలు (Heavy Vehicles):
నవభారత్ - జగ్గు తండా - ఓల్డ్ కొత్తగూడెం - మున్సిపల్ ఆఫీస్ - పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుండి ఖమ్మం వెళ్లగలరు.
ఆర్టీసీ బస్సులు, 4-వీలర్స్, 3-వీలర్స్, 2-వీలర్స్:
ఇల్లందు క్రాస్ - ఓల్డ్ డిపో - బస్ స్టాండ్ పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుండి ఖమ్మం వెళ్లగలరు.
4. ఖమ్మం నుండి పాల్వంచ వైపు వెళ్ళు వాహనదారులు (రూట్ మ్యాప్)
భారీ లోడ్ వాహనాలు (Heavy Vehicles):
పోస్ట్ ఆఫీస్ సెంటర్ - మున్సిపల్ ఆఫీస్ - ఓల్డ్ కొత్తగూడెం -జగ్గు తండా - నవభారత్ నుండి పాల్వంచ వెళ్లగలరు.
ఆర్టీసీ బస్సులు, 4-వీలర్స్, 3-వీలర్స్, 2-వీలర్స్:
పోస్ట్ ఆఫీస్ సెంటర్ - బస్ స్టాండ్ -ఓల్డ్ డిపో ఇల్లందు క్రాస్ నుండి పాల్వంచ వెళ్లగలరు.
5. పాల్వంచ నుండి విజయవాడ వైపు వెళ్ళు వాహనదారులు (రూట్ మ్యాప్)
భారీ లోడ్ వాహనాలు (Heavy Vehicles):
నవభారత్ - జగ్గు తండా - ఓల్డ్ కొత్తగూడెం మున్సిపల్ ఆఫీస్ -రామావరం మీదగా విజయవాడ వెళ్లగలరు.
ఆర్టీసీ బస్సులు, 4-వీలర్స్, 3-వీలర్స్, 2-వీలర్స్:
ఇల్లందు క్రాస్ - ఓల్డ్ డిపో - బస్ స్టాండ్ - పోస్ట్ ఆఫీస్ సెంటర్ - రామావరం మీదగా విజయవాడ వెళ్లగలరు.
6. విజయవాడ నుండి పాల్వంచ వైపు వెళ్ళు వాహనదారులు (రూట్ మ్యాప్)
భారీ లోడ్ వాహనాలు (Heavy Vehicles):
మున్సిపల్ ఆఫీస్ - ఓల్డ్ కొత్తగూడెం - జగ్గు తండా నవరత్ నుండి పాల్వంచ వెళ్లగలరు.
ఆర్టీసీ బస్సులు, 4-వీలర్స్, 3-వీలర్స్, 2-వీలర్స్:
పోస్ట్ ఆఫీస్ సెంటర్ - బస్ స్టాండ్ -ఓల్డ్ డిపో ఇల్లందు క్రాస్ నుండి పాల్వంచ వెళ్లగలరు.
గమనిక: ప్రయాణీకులు, వాహనదారులు పోలీస్ సిబ్బందికి సహకరించి సురక్షితంగా ప్రయాణించవలసిందిగా కోరడమైనది.
0 కామెంట్‌లు