సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ

సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ
అచ్చంపేట:బల్మూరు మండలం కొండనాగుల గ్రామంలోని ఎంపీపీఎస్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ జిల్లా విద్యాశాఖ అధికారితో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించి వారి విద్యాభ్యాసానికి శుభారంభం చేశారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో చదువుకొని భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.విద్యా అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యా ప్రమాణాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కాట్రాజ్ పద్మ, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు