ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు


ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని ఉప్పాక ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్  సుభద్ర తెలిపారు.  బడిబాట కార్యక్రమంలో భాగంగా ఉప్పాక  గ్రామంలో సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల ప్రత్యేకతలను వివరించి తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని కోరారు. విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, మధ్యాహ్న భోజనం, డిజిటల్ బోధన వంటి సౌకర్యాలు అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, రవికుమార్, అనూష,నాగమణి, లావణ్య గ్రామ ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు