SIRపై BLAలకు శిక్షణ కార్యక్రమం

అచ్చంపేట, జూన్ 8  ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ కార్యక్రమం (Special Intensive Revision-SIR)పై కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అచ్చంపేట నియోజకవర్గంలో బూత్ లెవల్ ఏజెంట్లకు (BLAలు) శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సంఘటన్ సృజన్ అభియాన్ కోఆర్డినేటర్, SIR శిక్షణ కార్యక్రమాల ఇన్‌చార్జ్ రాచమల్ల సిద్దేశ్వర్, నాగర్‌కర్నూల్ డీసీసీ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటరు జాబితా అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేందుకు బీఎల్‌ఏలు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. SIR ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు, వివరాల్లో తప్పుల సవరణ, డూప్లికేట్ ఎంట్రీల తొలగింపు వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు.
జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ లెవల్ అధికారులు (BLOలు) ఇంటింటికీ తిరుగుతూ ఓటర్ల వివరాలను సేకరిస్తారని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి బూత్‌లో బీఎల్‌ఏలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ ఖచ్చితమైన సమాచార సేకరణకు సహకరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, బూత్ లెవల్ ఏజెంట్లు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు