పినపాక: ఐదుగురు సభ్యులతో కూడిన దిశా కమిటీలో పినపాక మండలం నుంచి పొట్లపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ మద్దెల సమ్మయ్య నామినేట్ అయ్యారు. ఈ సందర్భంగా పినపాక మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ తనకు దిశా కమిటీలో అవకాశం కల్పించిన జిల్లా కలెక్టర్ అంకిత్ మరియు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామీణ ప్రజల సమస్యలను కమిటీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఆదివాసీ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తన వంతు సేవలు అందిస్తానన్నారు.తనపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించిన నాయకత్వానికి న్యాయం చేసేలా పనిచేస్తానని మద్దెల సమ్మయ్య తెలిపారు.
0 కామెంట్‌లు