పినపాక మండలంలో విద్యా వారోత్సవాలు ప్రారంభం

పినపాక మండలంలో విద్యా వారోత్సవాలు ప్రారంభం
-ఉపాధ్యాయులు – తల్లిదండ్రుల సమావేశాలు, బడిబాట కార్యక్రమాలు నిర్వహణ
పినపాక:పినపాక మండలంలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 11 నుంచి 17 వరకు విద్యా వారోత్సవాలను నిర్వహిస్తున్నామని ఎంఈఓ నాగయ్య తెలిపారు. ఇందులో భాగంగా గురువారం పినపాక మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు – తల్లిదండ్రుల సమావేశాలు నిర్వహించి, ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలపై అవగాహన కల్పించారు. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో బోధన, రెండు జతల యూనిఫామ్‌లు, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, కంప్యూటర్ విద్య, యోగ, కరాటే శిక్షణ, బాలికలకు సైకిళ్లు, మధ్యాహ్న భోజన పథకం వంటి సదుపాయాలను ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు.అలాగే వారంలో మూడు రోజులు గుడ్డు, మూడు రోజులు రాగి జావా అందిస్తున్నారని, ఈ విద్యా సంవత్సరంనుంచి 11 వస్తువులతో కూడిన కిట్‌ను కూడా విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎలాంటి ఖర్చు లేకుండా అనుభవం కలిగిన ఉపాధ్యాయుల ద్వారా ఒత్తిడి లేని విద్యను బోధిస్తున్నామని వివరించారు.ఈ కార్యక్రమాల్లో మండల విద్యాధికారి కొమరం నాగయ్య, ప్రధానోపాధ్యాయులు కె. రమణ, కె. విజయలక్ష్మి, టి. మాధవరావు, గ్రామ సర్పంచులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు , విద్యార్థులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు