ఉపాధి హామీ కూలీలకు సామాగ్రి పంపిణీ

ఉపాధి హామీ కూలీలకు సామాగ్రి పంపిణీ
- మజ్జిగ ,మంచినీరు అందజేసిన సర్పంచ్ 
పినపాక: పొట్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని చిన్న చెరువు వద్ద కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను గ్రామ సెక్రటరీ సందీప్, సర్పంచ్ సమ్మయ్య సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న కూలీలకు గడ్డపలుగులు, తట్టలు పంపిణీ చేశారు.
వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కూలీల ఆరోగ్య రక్షణ కోసం చల్లని మజ్జిగ, నీరు అందజేశారు. కూలీలు ఎండలో పనిచేస్తున్న సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ మద్దెల సమ్మయ్య, పంచాయతీ కార్యదర్శి సందీప్, వార్డు సభ్యుడు తొలేం మల్లేష్ పాల్గొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తొలేం కృష్ణ, చర్ప అనంతరావు, పోలిపోయిన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు