పినపాక:తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పనిచేసిన అనుబంధంతో జిల్లావ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన అభిమానులతో కలిసి ఆయన రాజకీయ జీవితంలో 40 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు నిర్వహించామని కోలేటి భవానీ శంకర్ తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కొందరు పార్టీ నాయకులు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. “నేనొక్కడినే ఈ కార్యక్రమం చేయలేదు.. ఎంతో మంది అభిమానులు కలిసి నిర్వహించారు. కాంతారావు గారు నేను పార్టీలో పనిచేయాలని భావిస్తే ఉంచుకుంటారు.. లేకపోతే లేదు. ఇది ఏమైనా ప్రభుత్వ ఉద్యోగమా?” అంటూ పార్టీ శ్రేణులపై ఘాటుగా స్పందించారు.
0 కామెంట్‌లు