పేరుకుపోతున్న మొక్కజొన్న నిల్వలులారీలు పంపించాలని రైతులు, అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) డిమాండ్

పేరుకుపోతున్న మొక్కజొన్న నిల్వలు

లారీలు పంపించాలని రైతులు, అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) డిమాండ్

*గుండాల మండలం మే 3 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి*

ప్రాథమిక వ్యవసాయ సహకారసంఘం (పిఎసిఎస్) ద్వారా ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు ప్రారంభించి రైతుల దగ్గర కొనుగోలు చేసి పది రోజులైనప్పటికీ ఇప్పటివరకు ప్రభుత్వం ఒక్క లారీ కూడా పంపలేదని వెంటనే రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీల ద్వారా తీసుకెళ్లాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) జిల్లా నాయకులు గుండాల సర్పంచ్ కొమరం సీతారాములు, బచ్చల సారన్న డిమాండ్ చేశారు.

    శనివారం గుండాల పిఎసిఎస్ ముందు రైతులతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారం పది రోజులు క్రితం మొక్కజొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభించి రైతుల దగ్గర ధాన్యాన్ని ధాన్యాన్ని కొనుగోలు చేసినప్పటికీ ఇప్పటివరకు లారీల ద్వారా తీసుకెళ్లకపోవడం మూలంగా ధాన్యంతో సొసైటీ ప్రాంగణం మొత్తం నిండిపోయిందని, వాతావరణ శాఖ తెలంగాణలో రాబోయే మూడురోజు వర్షాలు పాటు ఉన్నాయని హెచ్చరిస్తుందాని, వర్షం కురిస్తే దాన్ని మొత్తం తడిసిపోతుందని దీని దృష్టిలో పెట్టుకొని మార్క్ ఫేడ్ అధికారులు లారీలను పంపించి మొక్కజొన్న ధాన్యాన్ని తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.
  లేనియెడల మొక్కజొన్న పండించిన రైతులతో పెద్ద ఎత్తున ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
      ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ- అఖిలభారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్)నాయకులు యాసరపు వెంకన్న, గడ్డం లాలయ్య , పర్శక రవి, అరెం నరేష్, మోకాళ్ళసూర్యనారాయణ, గోగ్గల శ్రీను, పాయం ఎల్లన్న, భుఖ్య వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు