పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గొల్లగూడెం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామ ప్రజలకు ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి వైద్య సలహాలు అందించారు. ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి అవసరమైన మందులు పంపిణీ చేసి, సమయానికి పరీక్షలు చేయించుకోవాలని వైద్య సిబ్బంది సూచించారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఇలాంటి ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు