విద్యుత్ షాక్ తో గేద మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం పాతరెడ్డిపాలెం గ్రామంలో విద్యుత్ షాక్‌తో గేదె మృతి చెందింది. గ్రామానికి చెందిన ముక్కు రవీందర్ రెడ్డికి చెందిన గేదె ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతి చెందిన గేదె విలువ సుమారు రూ.1 లక్ష వరకు ఉంటుందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే స్థానిక రైతులు, గ్రామస్తులు సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ప్రమాదానికి గల కారణాలను గుర్తించి బాధిత రైతుకు నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు