విద్యుత్ చౌర్యం నేరం – గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం


పినపాక మండలం వెంకటరావుపేట గ్రామంలో విద్యుత్ ప్రమాదాలపై గ్రామస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యుత్ శాఖ ఏఈ వేణుగోపాల్ హాజరై మాట్లాడారు.

విద్యుత్ చౌర్యం చట్ట విరుద్ధమని, ఇది ప్రమాదాలకు దారితీస్తుందని ఆయన హెచ్చరించారు. అక్రమ కనెక్షన్లు, నాసిరకం వైర్లు ఉపయోగించడం వల్ల అగ్ని ప్రమాదాలు, ప్రాణాపాయాలు సంభవించే అవకాశం ఉందని తెలిపారు.

విద్యుత్ పరికరాలను జాగ్రత్తగా వినియోగించుకోవాలని, ఎలాంటి సమస్యలు వచ్చిన వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ లైన్మెన్లు, సిబ్బంది పాల్గొన్నారు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు