మహిళా ప్రజాప్రతినిధుల పాత్ర గ్రామాభివృద్ధిలో కీలకమని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును పినపాక మండలానికి చెందిన మహిళా సర్పంచులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా
గ్రామాల అభివృద్ధి, మౌలిక వసతులు, తాగునీటి సమస్యలు, రోడ్లు మరియు సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై ఎమ్మెల్యేతో చర్చించారు. మహిళా సర్పంచుల సమస్యలను ఎమ్మెల్యే శ్రద్ధగా విని, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భూపాలపట్నం సర్పంచ్ స్వప్న, పినపాక సర్పంచ్ అలివేలు, సీతారాంపురం సర్పంచ్ అనిత, జగ్గారం సర్పంచ్ సుహాసిని, పాత రెడ్డిపాలెం సర్పంచ్ నాగ కుమారి, తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు