మణుగూరు: పట్టణంలోని ఆదర్శనగర్‌లో మెట్ల వాగుపై నిర్మించనున్న రిటైనింగ్ వాల్ పనులకు స్థానిక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు భూమి పూజ నిర్వహించారు. సుమారు రూ.2 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ నిర్మాణ పనులు ప్రాంతీయ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు.
వాగు పరివాహక ప్రాంతాల్లో వరదల సమయంలో కలిగే ఇబ్బందులను తగ్గించడంలో ఈ రిటైనింగ్ వాల్ కీలక పాత్ర పోషిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పనులు వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు