గుండాల మండలం మే 2 (స్వాతంత్ర్య భారత్) ప్రతినిధి
141 వ కార్మిక దినోత్సవం మే డే వేడుకలు గుండాల సాయనపల్లి దామరతోగులో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వాగబోయిన రమేష్, బచ్చల రామయ్య జెండాను ఆవిష్కరించారు
అనంతరం వారు మాట్లాడుతూ, కార్మికుల హక్కుల సాధన కోసం జరిగిన పోరాటాలను స్మరించుకోవడం మేడే యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. కార్మిక వర్గం దేశ అభివృద్ధికి మూలస్థంభమని, వారి కష్టానికి తగిన గౌరవం, హక్కులు కల్పించాల్సిన అవసరం ఉందని వారు అన్నారు.
కార్మికుల ఐక్యత, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో స్థానిక కార్మికులు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు షాహిద్ బి కే యం యు మండల కార్యదర్శి గడ్డం శ్రీనివాస్ ఎస్కే సాహెబ్, గంగాధరి రాజయ్య, సనప చందు మోడం సతీష్ రామ్ మల్లేష్, నాసిర్ పవన్ హరీష్.తదితరులు పాల్గొన్నారు
0 కామెంట్‌లు