బూర్గంపాడు: మండలంలోని జింకల గూడెం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందినట్లు సమాచారం.
మృతుడు అంజనాపురం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి కారణాలు ఏమిటి అన్నదానిపై విచారణ కొనసాగుతోంది.
0 కామెంట్‌లు