బస్ షెల్టర్ లేక ప్రయాణికుల ఇబ్బందులు

బస్ షెల్టర్ లేక ప్రయాణికుల ఇబ్బందులు
మణుగూరు: పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన మణుగూరు పట్టణంలో బస్ షెల్టర్ లేకపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సుల కోసం వేచి ఉండేందుకు సరైన సదుపాయం లేక ప్రజలు చెట్ల కిందే నిలబడాల్సి వస్తోంది.

ఇప్పటికే అధికారులు బస్ షెల్టర్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం, ఎండల సమయంలో ప్రయాణికులు మరింత ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

కొంతమంది వ్యక్తుల కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలగడం సరైంది కాదని, వెంటనే బస్ షెల్టర్ నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రయాణికులు, స్థానికులు అధికారులను కోరుతున్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు