జమ్మికుంట రైల్వే స్టేషన్ వద్ద గుర్తుతెలియని మహిళ మృతి

జమ్మికుంట రైల్వే స్టేషన్ వద్ద గుర్తుతెలియని మహిళ మృతి

జమ్మికుంట రైల్వే స్టేషన్ టికెట్ బుకింగ్ హాల్ ప్రవేశద్వారం వద్ద మే 9, 2026న సుమారు 25-30 ఏళ్ల వయస్సు గల ఓ గుర్తుతెలియని మహిళ స్పృహ తప్పి పడిఉండగా, డ్యూటీలో ఉన్న చీఫ్ బుకింగ్ సూపర్వైజర్ 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అనంతరం ఆమెను ప్రభుత్వ ఆసుపత్రి జమ్మికుంటకు తరలించగా, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రి వరంగల్‌కు పంపించారు. చికిత్స పొందుతూ మే 10న ఆమె మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

మృతురాలు బ్లూ కలర్ డిజైన్ గల హాఫ్ ప్యాంట్, పింక్-బ్లూ-పసుపు రంగుల డిజైన్ గల టాప్ ధరించి ఉన్నారు. ఆమెతో పాటు సుమారు నాలుగేళ్ల వయస్సు గల బాలుడు ఉండగా, హాస్పిటల్ సిబ్బంది బాలుడిని చైల్డ్ హోమ్‌కు తరలించారు. మృతురాలి వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు లేదా ఇతర వివరాలు లభించలేదు.
మృతదేహాన్ని ఎంజీఎం ఆసుపత్రి వరంగల్ మార్చురీలో భద్రపరిచినట్లు ప్రభుత్వ రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ జి. తిరుపతి తెలిపారు. మృతురాలి వివరాలు తెలిసిన వారు 9949304574 లేదా 8712658604 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు