భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు అంబేద్కర్ సెంటర్‌లో ఓ ఆటోలో అకస్మాత్తుగా పొగలు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వేసవి తీవ్రత కారణంగా ఆటో ఇంజన్ ఫెయిల్యూర్ కావడంతో ఇంజన్ భాగం నుంచి ఒక్కసారిగా పొగలు వచ్చినట్లు సమాచారం. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే సహాయ చర్యలు చేపట్టారు.
0 కామెంట్‌లు