దగ్ధమైన పామాయిల్ తోటను పరిశీలించిన సిపిఎం నాయకులు..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం కుమ్మరిగూడెంలో అగ్ని ప్రమాదానికి గురైన పామాయిల్ తోటను సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు పరిశీలించారు. 4.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న తోటలో సుమారు 250 పామాయిల్ మొక్కలు దగ్ధమయ్యాయి. ఘటన స్థలాన్ని సందర్శించిన ఆయన బాధిత రైతుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అన్నవరపు కనకయ్య, కే బ్రహ్మచారి, రేపాకుల శ్రీనివాస్, భద్రయ్య, గద్దల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.