ఆదోని: 140వ మేడే సందర్భంగా ఆదోని పట్టణంలోని ప్రధాన సెంటర్లలో ర్యాలీ నిర్వహించి ఐఎఫ్‌టియు జెండాను జిల్లా కార్యదర్శులు వెంకప్ప, నర్సన్న ఎగరవేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, చికాగో కార్మికుల స్ఫూర్తితో సాధించుకున్న 8 గంటల పనిదినాన్ని కొనసాగించాలన్నారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసి, కార్మికుల హక్కులను పరిరక్షించే వరకు ఉద్యమాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు.
పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యూటీ వంటి సంక్షేమ చట్టాలు కార్మికులకు అందకుండా చేసే విధంగా లేబర్ కోడ్లు ఉన్నాయని విమర్శించారు. ఫ్లోర్ వేజ్ పేరుతో జీతాలు తగ్గే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్, పీఓడబ్ల్యూ నాయకులు మల్లికార్జున, మణి, మహదేవమ్మ, ప్రసాద్, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
0 కామెంట్‌లు