భద్రాచలం, మే 01: తెలంగాణ ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మణుగూరు మిట్టగూడెం గిరిజన సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలలో మే 2న ఉదయం 7.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ రవి బండారుపల్లి తెలిపారు.
ITC MSK, PRATHAM సంస్థలతో పాటు పలు కంపెనీలు బీపీఓ, టెక్నీషియన్, క్వాలిటీ, మల్టీ స్కిల్లింగ్, డెలివరీ వంటి ఉద్యోగాలను అందిస్తున్నాయి. డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.
— అదనపు పౌర సంబంధాల అధికారి, భద్రాచలం
0 కామెంట్‌లు